శ్రీ దశవిద్యా మహాగణపతిగా కొలువైన ఖైరతాబాద్ మహాగణపతికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. గంగమ్మ ఒడిలో చేరేందుకు మహాగణపయ్య శోభాయాత్రగా తరలివస్తున్నాడు. ఖైరతాబాద్ బడా గణపయ్య శోభాయాత్ర హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిన్న అర్ధరాత్రి నుంచి ప్రత్యేక పూజలందుకుంటున్న లంబోదరుడు ఇవాళ గంగమ్మ వద్దకు చేరేందుకు పయనమయ్యాడు.
63 అడుగుల ఎత్తులో కొలువైన మట్టి గణపతిని అత్యంత పదిలంగా హుస్సేన్ సాగర తీరానికి చేర్చేందుకు కమిటీ సభ్యులు ఇప్పటికే రూట్ మ్యాప్‌ని సైతం సిద్ధం చేశారు. టెలిఫోన్ భవన్ , తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కనుంచి సచివాలయం మీదుగా సాగర తీరానికి చేర్చనున్నారు. ఈరోజు మధ్యాహ్నం లోపు శోభాయాత్రను పూర్తిచేసి నిమజ్జన క్రతువు పూర్తిచేయాలని భావిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల సమయంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది.
ఈ ఏడాది ఖైరతాబాద్ భారీ విఘ్నేశ్వరుడిని సుమారు 20లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు. బుధవారం రోజున ఖైరతాబాద్ మహాగణపతిని కేంద్రపర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన పోయి…అన్నివర్గాలకు అందుబాటులో ఉండే సీఎం రావాలని కోరుకున్నట్లు తెలిపారు.