ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య రాజకీయంగా దుమారం రేపుతోంది. బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మంత్రి పువ్వాడ అజయ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మంత్రిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈరోజు (గురువారం) సాయి గణేష్ కుటుంబాన్ని బీజేపీ ఎంపీ సోయం బాపురావు పరామర్శించారు. కార్యకర్త మరణానికి కారణం అయిన మంత్రి పువ్వాడ అజయ్ ని వెంటనే బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పోరేటర్ భర్తను కూడా అరెస్ట్ చేయాలని … కేసీఆర్ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రి పువ్వాడ అజయ్ ని బర్త్ రఫ్ చేయాలి….. ఖమ్మం ఘటనపై బీజేపీ ఎంపీ బాపురావు డిమాండ్
-