అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి

-

అమెరికాలో ఇటీవల కత్తిదాడికి గురైన ఖమ్మం విద్యార్థి గత కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తాజాగా ఆ యువకుడు మృతి చెందాడు. అమెరికా ఆస్పత్రి వైద్యులు విద్యార్థి కుటుంబానికి సమాచారం అందించారు. ఎంఎస్ చదవడానికి వెళ్లిన వరుణ్ రాజ్ .. కత్తిపోట్లకు గురై దాదాపు పది రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఎట్టకేలకు తుదిశ్వాస విడిచాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం తమ కుమారుడిని అమెరికాకు పంపితే ఇలా ప్రాణాలే పోతాయని ఊహించలేదంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్‌(29) ఎంఎస్‌ చదువుతూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. గత నెల 31వ తేదీన(మంగళవారం) జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో వరుణ్ కణతపై పొడిచాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన వరుణ్​కు అప్పటి నుంచి అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం వరుణ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఇప్పుడు ఇంతలోనే వరుణ్ మృతి చెందాడన్న వార్త విని ఆ యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడిని కడచూపు చూసుకునే వీలు కల్పించాలని.. వరుణ్ మృతదేహాన్ని భారత్​కు రప్పించాలని అతడి తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news