తెలంగాణ సీఎం అభ్యర్థిని ఈరోజు ఖరారు చేస్తాం – ఖర్గే

-

 

తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు. ఈ రోజు తెలంగాణ సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తామన్నారు. సాయంత్రం లోపు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు మల్లికార్జున ఖర్గే.

ఇక ఇప్పటికే సీఎల్పీ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిన పార్టీ.. సోమవారం రాత్రికి ప్రమాణస్వీకారం ఉంటుందని తొలుత ప్రచారం చేసింది. కానీ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో వాయిదా పడింది.

నేడు ఖర్గేతో డీకే శివకుమార్‌, ఠాక్రే భేటీ అనంతరం దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా దిల్లీ వెళ్లారు. వారిద్దరు కూడా ఖర్గేతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ఇవాళ నిర్ణయిస్తామని ఖర్గే తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news