హైదరాబాద్ కిడ్నాప్ కేసు నమోదు అయింది. ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాప్ కేసులు ఎక్కువ అయిన సంగతి తెలిసిందే. చిన్న పిల్లలను ఎత్తుకుని పోయే బ్యాచ్ తిరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే… హైదరాబాద్ చంచల్‌గూడలో 9 నెలల చిన్నారి కిడ్నాప్ అయింది.
నర్సింగ్ హోమ్ ఆస్పత్రిలో పాపను కిడ్నాప్ చేశాడు పని పనిషి. దీంతో మాధన్నపేట్ పీఎస్‌లో బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు ప్రారంభించింది. అయితే.. ఆ పనిమనిషి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన షహనాజ్ ఖాన్‌గా గుర్తించారు పోలీసులు. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.