కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ లో మార్పులు

-

వరుసగా రెండో సారి కరీంనగర్ ఎంపీగా గెలవడంతో పాటు ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ప్రమాణం చేసిన బండి సంజయ్ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్లో మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 17న హైదరాబాద్కు వస్తారని ఇప్పటికే పార్టీ శ్రేణులు తెలపగా.. 19న తెలంగాణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తాజాగా తెలిసింది.

కేంద్ర మంత్రి బొగ్గు, మైనింగ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డితో కలసి ఈ నెల 19 వ తేదీన హైదరాబాద్కు బండి సంజయ్ రానున్నట్లు తెలిసింది. ఇక, కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రిగా బండి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి రానుండటంతో తమ అభిమాన నాయకులకు ఘన స్వాగతం చెప్పేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news