మేడిగడ్డ ప్రాజెక్టుకు బీజేపీ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే వెళ్లి చూసి వచ్చామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు తాము మళ్లీ వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు.
కృష్ణ జలాల వివాదంపై ఏపీ, తెలంగాణ కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. మరోవైపు రేపు మేడిగడ్డకు సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు వెళ్ళనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
ఇది ఇలా ఉండగా, మేడిగడ్డపై కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు మేడిగడ్డకు రావాలని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలకు కాంగ్రెస్ సర్కార్ లేఖ రాసింది. రేపు మేడిగడ్డ సందర్శనకు రావల్సిందిగా బీఆర్ఎస్, బిజెపి,ఏంఐఎం, సీపీఐ పార్టీ అధ్యక్ష్యులకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.