కృష్ణా నది ప్రాజెక్టులపై తీర్మానం నేపథ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వం నోట్‌

-

కృష్ణా నది ప్రాజెక్టులపై తీర్మానం నేపథ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వం నోట్‌ ఉంచింది. కృష్ణానది ప్రాజెక్టులపై వాస్తవాలు.. కేసీఆర్‌ ప్రభుత్వ తప్పిదాలు పేరుతో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నోట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ విఫలమైందని కాంగ్రెస్‌ సర్కార్ విమర్శించింది. కేసీఆర్‌ పాపాలే.. ఇప్పుడు తెలంగాణకు శాపాలుగా మారాయని నోట్‌లో వెల్లడించింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

“కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం కృషి చేస్తాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సమీక్షిస్తాం. గత ప్రభుత్వ జలదోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు గత ప్రభుత్వం మెుగ్గు చూపింది. ఎన్నికల రోజు ఏపీ ప్రభుత్వం సాగర్‌పైకి పోలీసులను పంపింది. ఎన్నికల రోజు ఏపీ అక్రమంగా నీటిని విడుదల చేసింది. ఏపీ పోలీసుల చొరబాటుపై బీఆర్ఎస్ చేష్టలుడిగినట్లు ఉంది.” అని రాష్ట్ర ప్రభుత్వం నోట్‌లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news