ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8 స్థానాల్లో ఆ పార్టీ పోటీలో నిలిచింది. కానీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేక పోయింది. మరోవైపు బీజేపీ మాత్రం 8 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈ పొత్తు ఇరు పార్టీలకు పెద్దగా ఉపయోగపడలేక పోయినట్లు ఫలితాలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పొత్తుకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిషాకింగ్ కామెంట్లు చేసినట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా కిషన్ రెడ్డి సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’(ట్విటర్) వేదికగా స్పందించారు.
‘‘ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంలో జనసేనతో కలిసి yీజేపీ పోటీ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ నిర్ణయం రెండు పార్టీలు ఆలోచించి తీసుకున్నదే. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే మేము జనసేనతో కలిసి బరిలో దిగాం. అయితే, ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కొందరు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నేను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాం’’ అని కిషన్ రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు.
అందరికీ నమస్కారం,
ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంలో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ నిర్ణయం రెండు పార్టీలు ఆలోచించి తీసుకున్నదే. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే మేము.. జనసేనతో కలిసి బరిలో దిగాం.
అయితే, ఆదివారం సాయంత్రం నుంచి సోషల్…
— G Kishan Reddy (@kishanreddybjp) December 10, 2023