అనుకున్న ఫలితం రాకపోయినా.. మా ఓటు శాతం పెరిగింది : కిషన్ రెడ్డి

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో రిపీట్ చేస్తామని మొదటి నుంచీ చెబుతున్న మాటను ఆ పార్టీ నిజం చేసింది. మరోవైపు బీఆర్ఎస్ 37, బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్‌ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

“మా ఓటు శాతం 6.9 నుంచి 14 శాతానికి పెరిగింది. ఒక స్థానం నుంచి 8 స్థానాలకు పెరిగాం. శాసన సభలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేందుకు కృషి చేస్తాం. అనుకున్న ఫలితాలు రాలేదు.. సమీక్షించుకుంటాం. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను గద్దె దించాం. లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌ అని రాహుల్‌ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ మాదే విజయం.” అని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news