ఎన్నికల శంఖారావం పూరించిన కిషన్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయసంకల్ప యాత్రలు ప్రారంభం అయ్యాయి. మంగళవారం ఉదయం నారాయణపేట జిల్లా కృష్ణ గ్రామం లో యాత్రను కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు. శంఖారావం పూరించి యాత్రను షురూ చేశారు. రాష్ట్రంలో ఇవాళ మొత్తం నాలుగు క్లస్టర్లలో యాత్రలు ప్రారంభం అయ్యాయి. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గం 5 క్లస్టర్లుగా బిజెపి విభజించింది.

114 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,500 కిలోమీటర్ల మేరకు ఈ విజయసంకల్పయాత్రలు జరగనున్నాయి. ఈ యాత్రలో భాగంగా 16 సమావేశాలు, 102 రోడ్డు షోలు నిర్వహించనున్నారు. మార్చి రెండవ తేదీన యాత్రలు ముగియనున్నాయి. ముగింపు సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పాలి స్థానాల్లో పాదా వేయాలని బిజెపి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పొలంలో విస్తృతంగా జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news