హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ లపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లపై కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరిగాయని, తెలంగాణలో ఐసీస్ ఏజెంట్లు విచ్చలవిడిగా ఉండేవారంటూ పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆదివారం బీజేపీ పార్టీ నిర్వహించిన ఓ సమావేశంలో మీడియాతో మాట్లాడిన ఆయన నరేంద్రమోడీ రాకతో దేశంలో శాంతి భద్రతలు పెరిగాయన్నారు.

ఈ మేరకు ఉగ్రవాదులు పాకిస్థాన్ లో కూర్చొని రిమోట్ నొక్కితే హైదరాబాద్ లో గోకుల్ చాట్, దిల్ సుఖ్ నగర్, లుంబిని పార్క్ లలో మూడుచోట్ల బాంబ్ బ్లాస్ట్ జరిగాయన్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ముంబై లాంటి ప్రాంతాల్లో నడుస్తున్న ట్రైన్ లలో బాంబ్ బ్లాస్ట్ లు చోటుచేసుకున్నాయని, పాకిస్థాన్ ఐఎస్ఐ వెళ్ళు పాతుకొని భారత్ ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసిందని ఆయన అన్నారు. ‘మతకలాహాలు ప్రేరేపించి RDXలు పేల్చేవాళ్లు. AK 47లు యధేచ్చగా భారత దేశానికి పంపించేవాళ్లు. భారత్ లో విద్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ వేల కోట్లు ఖర్చు పెట్టేది.

ఇండియన్ కరెన్సీని పాకిస్థాన్ లో నకిలీ కరెన్సీ గా ముద్రించి, ఒక ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థను పాకిస్థాన్ నడిపేది. జమ్మూ కశ్మీర్ లోనే 46 వేల మంది భారతీయులు ఉగ్రవాదానికి బలయ్యారు. గతంలో పాకిస్థాన్ చంపే వాళ్లు.. మనం చచ్చే వాళ్ళం. మన ఖర్మ ఇంతే అనే పరిస్థితి ఉండేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version