ఇవాళ కేసినేని నాని, కృష్ణప్రసాద్ పై దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ఇబ్రాహీంపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని ఉమ మాట్లాడారు. విజయవాడను ఉద్ధరించిన, ఇరగదీసిన అని పదే పదే చెప్పే కేశినేని నాని.. సింగపూర్ విమానం వివాఖకి చేరుకుంటే ఎందుకు మూసుకొని కూర్చున్నాడని ప్రశ్నించారు. పదవుల కోసం కేశినేని నాని ఎంతకైనా దిగజారతారని.. ఎంపీ భీ ఫారం టికెట్ కోసమే అమరావతిపై కేశినేని నాని విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పెట్టిన రాజకీయ బిక్షతోనే రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన కేశినేని నాని.. ఇవాళ ఆయనపైనే విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఆరుగురు ఎమ్మెల్యేలను బొంద పెట్టిన ఘనత వైసీపీ నేతలకే సొంతమని.. అలాంటి నేతలతో కేశినేని నాని కలవడం ప్రజలు కూడా హర్షించరని పేర్కొన్నారు. మైలవరం టెర్రరిస్ట్ వసంత కృష్ణ ప్రసాద్ తో చెట్టాపట్టాలేసుకొని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని ఆరోపించారు. కొండపల్లిలో మున్సిపాలిటీ ఫలితాల నేపథ్యంలో కౌన్సిలర్ల మీద కుర్చీలు ఎగిరిపడుతున్న ఏమి పట్టనట్టు చెరో పక్క చిద్విలాసంగా ఎంపీ, ఎమ్మెల్యే కూర్చొని చోద్యం చూశారే తప్ప అడ్డుకోలేదని.. దీనిని ఏమంటారు? అని ప్రశ్నించారు.