తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా కోదండరాం?

-

కోదండరాంను విద్యాశాఖ మంత్రిగా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కోదండరాంకు రేవంత్ సర్కారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఎంపీ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ జరగనుందని, ఆయనకు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమిస్తారని వార్తలు వచ్చినా…. మహేందర్ రెడ్డిని ఎంపిక చేశారు. విద్యాశాఖలో కోదండరాం అనుభవం ఉపయోగపడుతుందని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది.

ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఈ దరఖాస్తుల వడపోత ప్రక్రియను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇందుకోసం కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)ను వినియోగించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని, స్థలం లేనివారికి స్థలం కేటాయించడంతోపాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని కాంగెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version