తెలంగాణలో రాక్షసుడి పాలన పోయింది : కోదండరాం

-

తెలంగాణలో నూతన సర్కారు కొలువుదీరే సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లో కొత్త కేబినెట్ రూపొందనుంది. మరోవైపు రాష్ట్ర నూతన సీఎంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో దీనికి సంబంధించి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాతో పాటు కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. మరోవైపు వారితో పాటు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా ఎల్బీ స్టేడియానికి వెళ్లారు.

Kodandaram's efforts to ally with Congress

ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారని కేసీఆర్ సర్కార్​పై తీవ్రంగా మండిపడ్డారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉద్యోగులకు వారధిగా ఉంటానునని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని తెలిపారు.

“ఇక నుంచి వాట్సాప్ కాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఉన్నంత సంతోషం ఇవాళ ఉంది. రాక్షసుని పాలన పోయింది. ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన వారే హక్కులు భక్షించారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుంది. మీడియాపై కూడా ఆంక్షలు పోవాలి.” అని కోదండరాం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news