నల్గొండలో కోమటిరెడ్డి వర్సెస్ కంచర్ల..ఈసారి పైచేయి ఎవరిది?

-

Nalgonda: తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి రసవత్తరమైన పోరు జరగనుంది..గత ఎన్నికలకు భిన్నంగా తెలంగాణ రాజకీయ యుద్ధం నడవనుంది. ఈ సారి ఎన్నికల్లో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఇటు బి‌జే‌పి, అటు కాంగ్రెస్ పార్టీలు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్ల బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిల మధ్య వార్ తీవ్రంగా జరగనుంది. అలాగే కొన్ని చోట్ల బి‌ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వార్ నడిచే ఛాన్స్ ఉంది.

ఇక ఎక్కువ సీట్లలో త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. అయితే చాలా సీట్లలో నెక్ టూ నెక్ ఫైట్ జరగనుంది. అలా ఫైట్ జరిగే స్థానాల్లో నల్గొండ అసెంబ్లీ కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఒకప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డాగా ఉన్న ఈ స్థానంలో బి‌ఆర్‌ఎస్ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1999 ఎన్నికల నుంచి 2014 వరకు వరుసగా నాలుగు సార్లు గెలిచిన కోమటిరెడ్డి..గత ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీలో చిత్తుగా ఓడిపోయారు. బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి విజయం సాధించారు.  అలా కోమటిరెడ్డి విజయానికి కంచర్ల బ్రేక్ వేశారు.

అయితే ఈ సారి కంచర్లకు కోమటిరెడ్డి బ్రేక్ వేయాలని చూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సరే..తర్వాత జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి కోమటిరెడ్డి గెలిచారు. ఈ సారి ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీలోనే పోటీ చేస్తానని కోమటిరెడ్డి చెప్పారు.

తాజాగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్గొండ నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొన్న నేపథ్యంలో కోమటిరెడ్డి వచ్చి..తన సీటుని తానే ప్రకటించుకుంటున్నానని, రేవంత్ తనకు బీఫామ్ ఇంటికి పంపిస్తారని, కాబట్టి నల్గొండ ప్రజలు తనని గెలిపించాలని కోరారు. అయితే ప్రస్తుతం నల్గొండలో కోమటిరెడ్డి, కంచర్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. మరి ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version