కొండా సురేఖకు మంత్రి వర్గంలో ఉండే అర్హత లేదు : ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

-

తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలి పెను సంచలనాలే సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి మంత్రి కొండా సురేఖని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ.. హరీశ్ రావు, రఘునందన్ రావు స్పందించారు. కానీ కేటీఆర్ మాత్రం అస్సలు స్పందించలేదని ప్రశ్నించింది. దానికి కౌంటర్ గా కేటీఆర్ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి అని ప్రశ్నించారు. 

దీంతో కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది మంత్రి కొండా సురేఖ. కేటీఆర్ వల్లనే నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్నారని.. రకుల్ ప్రీత్ సింగ్ త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కేటీఆరే కారణమని పేర్కొంది. కేటీఆర్ సినీ నటులకు డ్రగ్స్ అలవాటు చేశాడని పేర్కొన్నారు. తాజాగా దీనిపై బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్పందించారు.  కొండ సురేఖకు అసలు మంత్రి వర్గంలో ఉండే అర్హత లేదని..  కాంగ్రెస్ పైన చేస్తున్న పోరాటానికి తట్టుకోలేకే కొండ సురేఖతో ఈ మాటలు మాట్లడిస్తున్నారు. అసలు మాటల్లో చెప్పలేని భాష మాట్లాడారు కొండ సురేఖ అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news