నాకు ఆ పదవులు కావాల్సిందే..కొండా సురేఖ లేఖ !

-

నాకు ఆ పదవులు కావాల్సిందేనంటూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి కొండా సురేఖ లేఖ రాశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. లేఖలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కోరారు. అలాగే తనను పీఈసీ సభ్యురాలిగా ఎంపిక చేసినందుకు కొండా సురేఖ ధన్యవాదాలు చెప్పారు. 27 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న తనను ఏఐసీసీ కార్యదర్శిగా లేదా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని కోరారు.

ఈ విషయాన్ని ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా అడిగినట్లు చెప్పారు. రాజకీయాల్లో తనకు దాదాపుగా 3 దశాబ్దాల అనుభవం ఉందని, మహిళా సాధికారత సాధించేందుకు నాకు అన్ని నైపుణ్యాలున్నాయన్నారు. టీపీసీసీలోని మహిళలు దేశంలో ప్రత్యేకంగా ఉండేలా చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో నేను చేసిన సేవ, వారితో కలిగిన సంబంధాలు, నెట్ వర్కింగ్ సామర్థ్యంతో ఏఐసీసీ సెక్రటరీ లేదా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ లకు నేను అర్హురాలినని బలంగా నమ్ముతున్నానని లేఖలో కొండా సురేఖ చెప్పారు. ఈ పదవుల్లో ఏది ఇచ్చినా.. వంద శాతం వాటికి న్యాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నట్లు లేఖలో కొండా సురేఖ రాశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version