కేసీఆర్ కనపడట్లేదు.. కేటీఆర్ గొంతు పిసికి చంపిండేమో – మంత్రి కొండా సురేఖ

-

konda surekha: నిన్న కేటీఆర్ పై కామెంట్స్‌ చేసిన మంత్రి కొండా సురేఖ..ఇవాళ కేసీఆర్‌ను టార్గెట్‌ చేశారు. కేసీఆర్ కనపడట్లేదు.. కేటీఆర్ గొంతు పిసికి చంపిండేమో అని మాకు అనుమానంగా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. బడ్జెట్ రోజు వచ్చి మళ్ళీ కేసీఆర్ కనపడకుండా పోయాడని… ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఏం చేస్తున్నారో తెలియదని చురకలు అంటించారు. గజ్వేల్ లో కేసీఆర్ కనపడటం లేదని పోలీస్ స్టేషన్2 లో ఫిర్యాదు చేస్తామని… ఎంపీ ఎన్నికల్లో సిద్దిపేట,గజ్వేల్ నియోజకవర్గాల్లో BJP, BRS మధ్య చీకటి ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు.

Konda Surekh’s sensational comments on KTR yesterday and KCR today

కవిత బెయిల్ కోసం ప్రధానితో మాట్లాడి ఒప్పందం చేసుకుని BRS పార్టీ నుంచి BJPకి క్రాస్ ఓటింగ్ జరిగిందని… సిసోడియాకి ఇవ్వని బెయిలు ముందుగా కవిత బయటికీ వచ్చిందంటే అది చీకటి ఒప్పందమే అన్నారు. కేటీఆర్ పోకడ వల్లే…బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తొమ్మిది హామీలు అమలు చేస్తే పదో హామీ ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని… సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని మాపై పిచ్చి రాతలు రాయిస్తున్నారని ఆగ్రహించారు. పదవి కాంక్షతో కేసీఆర్ ని కేటీఆర్ ఏదో చేశాడన్న ప్రచారం జరుగుతుందని…కేటీఆర్ సీఎం అనుకుని పనికిమాలిన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. BRS ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని.. కేటీఆర్ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గరపెట్టుకో అంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version