Kotha Prabhakar Reddy  : అంబులెన్స్‌లో వెళ్లి నామినేషన్ వేయనున్న కొత్త ప్రభాకర్ రెడ్డి

-

Kotha Prabhakar Reddy  : అంబులెన్స్‌లో వెళ్లి నామినేషన్ వేయనున్నారు దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కత్తిపోటుకు గురై చికిత్స పొందుతున్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేయనున్నారు.

Kotha Prabhakar Reddy namination Today

ప్రస్తుతం హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో ఉన్న ఆయన…. అంబులెన్స్ లో నేరుగా దుబ్బాక రిటర్నింగ్ ఆఫీస్ కు చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

ఇక అటు బిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇవాళ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నవంబర్ 9 అంటే ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ అభ్యర్థి గా, కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి గా నామినేషన్ వేయనున్నారు బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్.ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11 గంటలకు గజ్వేల్ లో…మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి లో.. నామినేషన్ దాఖలు చేస్తారు గులాబీ బాస్‌, సీఎం కేసీఆర్‌. అనంతరం కామారెడ్డి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news