తెలంగాణకు నీళ్లు కావాలంటే… నీళ్లు ఎత్తిపోయాల్సిందే: కేటీఆర్‌

-

కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాళేశ్వరం జలాలతో వాగులు, చెరువులు నింపామని, ఆ ప్రాజెక్టు వల్లే భూగర్భ జలాలు పెరిగాయని, చెరువులు నిండాయని తెలిపారు. సిరిసిల్ల జిల్లాల్లో 6 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయని వెల్లడించారు. కాళేశ్వరం వల్ల పాతాళగంగం పైకి వచ్చిందని వివరించారు. తెలంగాణకు నీళ్లు కావాలంటే… నీళ్లు ఎత్తిపోయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు కట్టి.. నీళ్లు ఎత్తిపోస్తే తప్ప తెలంగాణకు నీళ్లు రావని పేర్కొన్నారు.

తెలంగాణ భౌగోళిక స్వరూపం వల్ల నీళ్లు కావాలంటే.. నీళ్లు ఎత్తిపోయాల్సిందే. ఆకలి కేకల తెలంగాణ… కాళేశ్వరం వల్ల అన్నపూర్ణగా మారింది. కాళేశ్వరమంటే ఏంటో సజీవంగా చూపాట్టాలనుకున్నాం. ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు మేడిగడ్డ వెళ్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతాం. మార్చి 1నుంచి బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమం ఉంటుంది. 150 నుంచి 200 మంది భారాస ప్రజాప్రతినిధులతో చలో మేడిగడ్డ నిర్వహిస్తాం. చలో మేడిగడ్డ కార్యక్రమంలో తొలి రోజు కాళేశ్వరం వెళ్తాం. విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సమగ్రంగా సందర్శిస్తాం. అని కేటీఆర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news