2022-23లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం పెరిగాయి: కేటీఆర్‌

-

2022-23లో తెలంగాణ ఐటీ ఎగుమతులు 31.4 శాతం పెరిగాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని.. కొత్త రాష్ట్రం వచ్చాక 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు. రెండోరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఐటీ రంగంలో అభివృద్ధిపై చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే నిజామాబాద్‌కు ఐటీ హబ్‌ ఇచ్చినందుకు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి శాసనసభలో ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో ఐటీ విప్లవం వచ్చిందని చెప్పారు. ఐటీ ఐకాన్‌, ఫ్యూచర్‌ ఆఫ్‌ ది తెలంగాణ కేటీఆర్‌ అని కొనియాడారు. దేశంలో వచ్చే 2 ఐటీ ఉద్యోగాల్లో ఒక్కటి ఇక్కడే వస్తోందని జీవన్‌రెడ్డి  తెలిపారు.

అనంతరం కేటీఆర్ సమాధానమిస్తూ.. స్టేబుల్ గవర్న్‌మెంట్‌.. ఏబుల్ లీడర్‌షిప్‌ వల్లే ఇదంతా సాధ్యమని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో భూముల రేట్లు బాగా పెరుగుతున్నాయని తెలిపారు. గురుగ్రామ్‌లో ఐటీ పరిశ్రమను నాశనం చేస్తున్నారని.. హైదరాబాద్‌లో 1987లో మొట్టమొదట ఐటీ టవర్ వచ్చిందని అన్నారు. తెలంగాణ వచ్చేటప్పటికి మన ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్లు ఉండగా.. ఒక్క గతేడాదే మన ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లు ఉందని కేటీఆర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version