ఫ్యామిలీతో కలిసి ఓటేసిన కేటీఆర్.. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న హిమాన్షు

-

హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందినగర్‌లో కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్‌ ఓటేశారు. కేటీఆర్ తన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అయితే హిమాన్షు గత కొంతకాలంగా అమెరికాలో చదువుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఓటు వేసేందుకు ఆయన నగరానికి వచ్చారు. హిమాన్షు ఈ ఎన్నికల్లో తన మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తనలాగే మొదటిసారి ఓటు వేస్తున్న వారందరికి హిమాన్షు బెస్ట్ విషెస్ తెలిపారు. నేటి యువత తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

మరోవైపు కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేయాలని కోరారు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశం వచ్చిందని, ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశం అని కేటీఆర్ అన్నారు. మంచి ప్రభుత్వాలను మంచి నాయకులను మీ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటు వేయండి అని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news