ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్

-

తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్​లో రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓ పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చానని తెలిపారు. తెలంగాణలో ఓటు ఉన్న పౌరులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వాళ్లకే ఓటు వేశానని తెలిపారు.

మరోవైపు  ఓటు వేసిన తర్వాతే రోజు వారీ పనులు చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం మొత్తం ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని పిలుపునిచ్చారు. కాచిగూడ బర్కత్‌పురాలోని దీక్ష మోడల్ స్కూల్‌లో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కిషన్‌రెడ్డి.. ఓటు వేయకుండా విమర్శించటం సరికాదని అన్నారు. ఐదేళ్ల భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని, నచ్చిన వ్యక్తిని ఆలోచించి ఎన్నుకోవాలని సూచించారు.

ఇక బీఆర్ఎస్ మంత్రులు జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత వారి వారి ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా ఓటేసేందుకు కదలి రావాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news