జన్వాడ ఫాంహౌస్ నాది కానే కాదు…తప్పుంటే కూల్చేయండి అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్వాడ ఫాంహౌస్ కూల్చేస్తారని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్వాడ ఫాంహౌస్ తనది కాదని.. తన స్నేహితుడిదని వెల్లడించారు.
జన్వాడ ఫాంహౌస్ ను తాను లీజుకు తీసుకున్నట్లు చెప్పారు. జన్వాడ ఫాంహౌస్ కట్టడంలో ఎలాంటి తప్పు ఉన్నా… కూల్చేండని స్పష్టం చేశారు. అలాగే.. కాంగ్రెస్ నేతల కట్టడాలు కూడా కూల్చేయాలని కోరారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రుణమాఫీ ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందా.. లేదా.. ఎంత ఇస్తామన్నారు ఎంత ఇచ్చారు అని ప్రశ్నించారు.