అప్పుడు ఎందుకు జరుగలేదు.. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది : సీఎం జగన్

-

సీఎం మాత్రమే మారాడు. అప్పుడు ఎందుకు జరగలేదు.. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని ఆలోచించాలని పేర్కొన్నారు సీఎం జగన్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన జగనన్న చేదోడు సభలో పాల్గొన్న సీఎం.. సభలో మాట్లాడుతూ ఇలాంటి ప్రభుత్వం వస్తుంది. ఎవ్వరికీ లంచాల ఇవ్వకుండా ఇలాంటి సహాయం అందుతుంది అని నాలుగేళ్ల కిందట ఎవ్వరైనా అనుకున్నారా..?అని ప్రశ్నించారు. సీఎం మాత్రమే మారాడు.. అప్పుడు ఎందుకు జరుగలేదు. ఇప్పుడు ఎందుకు జరుగుతుందో ఆలోచించాలన్నారు.

చంద్రబాబు పాలన చూస్తే కుప్పం ప్రజలు కూడా మా వాడు అని చెప్పే పరిస్థితి లేదన్నారు సీఎం వై.ఎస్.జగన్. కుప్పంలో పేదవాడికి ఇల్లు ఇవ్వని పరిస్థితి. కుప్పంలో 20వేల స్థలాలు మేము ఇచ్చామని తెలిపారు. చంద్రబాబు హయాంలో 80వేల కోట్ల రుణమాఫీ చేస్తామని అమలు చేయలేదు. వైసీపీ హయాంలో రైతుకు తోడుగా ఉంటూ నడిపిస్తున్నామన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన మేనిపెస్టో చెత్త బుట్టలో వేశారని తెలిపారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం నెరవేర్చామని తెలిపారు. జన్మభూమి కమిటీలు మొదలు, రాజధాని భూముల స్కామ్, స్కిల్ స్కామ్ ఇలా చంద్రబాబు పాలన జరిగిందన్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version