రాష్ట్రం అప్పుల్లో ఉంటే సీఎం కొత్త క్యాంపు కోసం డబ్బెందుకు వృథా చేస్తున్నారు : కేటీఆర్

-

రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆర్థిక రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రం ఇప్పుడు కాక రేపుతోంది. ఇప్పటికే అసెంబ్లీ బీఆర్ఎస్ నేతలు ఈ శ్వేత పత్రంపై మాట్లాడారు. శ్వేత పత్రం తప్పుల తడకగా.. అంకెల గారెడీగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఇక తాజాగా దీనిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు.

శ్వేతపత్రం తప్పుడు సమాచారంతో నిండిన పత్రమని కేటీఆర్ అన్నారు. పూర్తి అబద్ధాలతో ఈ పత్రాన్ని రూపొందించారని ట్వీట్ చేశారు. అత్యంత విజయవంతమైన రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ప్రయత్నించడం సిగ్గు చేటని అన్నారు. వారి ఎజెండాకు అనుగుణంగా రాజకీయాలతో ఆర్థిక అంశాలను ముడిపెట్టి అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రం కష్టాల్లో ఉంటే… సీఎం కొత్త క్యాంపు కార్యాలయానికి డబ్బు ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించారు. దిల్లీలో తెలంగాణ భవన్‌ ఎందుకు నిర్మించాలనుకుంటున్నారని నిలదీశారు. వంద రోజుల్లో ఆరు హామీల అమలుకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, 100 రోజుల నోటీసుకు కౌంట్‌డౌన్‌ మొదలైందని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version