త్వరలోనే కరెంట్ ఛార్జీలు పెంచబోతున్నారు – కేటీఆర్‌

-

ఫ్రీ కరెంట్‌ పేరుతో..మిగతా వారిపై ఛార్జీలు వేస్తున్నారని ప్రశ్నించారు కేటీఆర్‌. కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతున్నదని కూడా హెచ్చరించారు. విద్యుత్ సరఫరా కు గ్యారెంటీ లేదు కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ అంటూ ఆగ్రహించారు. పవర్ లోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారని కూడా మండిపడ్డారు.

ktr comments over power bill

ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే.. గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉంది..! జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా ? అంటూ నిలదీశారు. ఒక్క గ్యారెంటీ సక్కగా అమలు చేసింది లేదు.. 420 హామీలకు అతీ గతీ లేదు… మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు..? అని ఆగ్రహించారు. 9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటుబాయే ? మళ్లీ ఈ నడ్డి విరిగే వడ్డనలు ఎందుకు ? అని ఆగ్రహించారు. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలే ! అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news