‘బలగం’ టీమ్ కు కేటీఆర్‌ అభినందనలు

-

69వ శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ -2024  వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో బలగం సినిమా సత్తా చాటింది. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టడమే గాక పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుంది ఈ సినిమా. ఇక తాజాగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్-2024 వేడుకల్లోనూ ఈ చిత్రానికి అవార్డుల పంట పండింది. ‘బలగం’ ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు, ఉత్తమ దర్శకుడిగా వేణు అవార్డు అందుకున్నారు.

ఈ సందర్భంగా బలగం చిత్రబృందానికి, దర్శకుడు వేణుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ‘బలగం’ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడిగా ఎంపికవడం పట్ల ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.. దర్శకుడు వేణు, టీమ్‌ను అభినందించారు. ‘‘ఇది మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం. భవిష్యత్‌లో మరిన్ని సాధించేందుకు ఇది తొలిమెట్టు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news