కాంగ్రెస్ కు ఓటేస్తే.. తెలంగాణ సంకనాకి పోవడం గ్యారెంటీ – మంత్రి కేటీఆర్‌

-

 

కాంగ్రెస్ కు ఓటేస్తే.. తెలంగాణ సంకనాకి పోవడం గ్యారెంటీ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు. మొన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ వాగ్ధానాలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు మీడియాతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు పదవి గ్యారంటీ లేదు ప్రజలకు 6 గ్యారంటీలు అంట.. అధికారంలోకి వచ్చేది లేదు పోయేది లేదని ఎద్దేవా చేశారు.

పొరపాటున కాంగ్రెస్ కి ఓటేస్తే కటిక చీకటి గ్యారంటీ.. తాగునీటి కష్టాలు గ్యారంటీ అని చురకలు అంటించారు కేటీఆర్‌. ఎరువుల కోసం విత్తనాల కోసం పోలీస్ స్టేషన్ ముందు నిలబడడం గ్యారంటీ అన్నారు మంత్రి కేటీఆర్‌. దళిత బంధు, రైతుబంధు ఎత్తేయడం గ్యారంటీ.. ఏడాదికో ముఖ్యమంత్రి మారడం గ్యారంటీ.. తెలంగాణ సంకనాకి పోవడం గ్యారెంటీ అంటూ మంత్రి కేటీఆర్‌ సెటైర్లు పేల్చారు. రాజకీయ అస్థిరతతో తెలంగాణ రాష్ట్రాన్ని కుదేలు చేయడం పక్కా గ్యారెంటీ అన్నారు మంత్రి కేటీఆర్.

https://x.com/TeluguScribe/status/1704119299743601106?s=20

Read more RELATED
Recommended to you

Latest news