ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైంది: కేటీఆర్‌

-

ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీపై కోపాన్ని రైతులపై చూపించవద్దని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వర్షాకాలం వచ్చేలోపు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మేడిగడ్డ పర్యటనకు బయల్దేరే ముందు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడారు.

చలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ మేడిగడ్డ సందర్శనకు బయల్దేరారు. అంతకుముందు గులాబీ నాయకులంతా తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి పర్యటనకు బస్సులు, కార్లలో పయనమయ్యారు. మొదట మేడిగడ్డను సందర్శించనున్న నేతలు.. అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడే కేటీఆర్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం మీడియా సమావేశంలో హరీశ్ రావు, కేటీఆర్ ప్రసంగిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version