మోదీతో మీటింగ్ ఎప్పుడూ స్ఫూర్తిదాయకం: బిల్‌ గేట్స్‌,

-

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన గురువారం రోజున ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రజా శ్రేయస్సు కోసం కృత్రిమ మేధ, వ్యవసాయం, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలు, మహిళల భాగస్వామ్యంతో అభివృద్ధి వంటి అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం సోషల్ మీడియా వేదిక ఎక్స్లో బిల్ గేట్స్ పోస్టు చేశారు.

‘‘నరేంద్ర మోదీని కలవడం ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. చాలా అంశాలు చర్చించాం. ప్రజా ప్రయోజనాల కోసం ఏఐ గురించి మాట్లాడాం. మహిళల నేతృత్వంలో అభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్యం, వాతావరణ అంశాల్లో ఆవిష్కరణలు సహా భారత్‌ నుంచి ఎలాంటి అంశాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలో చర్చించాం’’ అని గేట్స్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

గేట్స్‌ పోస్టుకు మోదీ స్పందిస్తూ.. ‘‘నిజంగా అద్భుతమైన సమావేశం! మన గ్రహాన్ని మెరుగుపరిచే, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తులను శక్తిమంతం చేసే రంగాల గురించి చర్చించడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందిని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version