అమరావతి ల్యాండ్ పూలింగ్ పై రైతులకు డౌట్స్.. మంత్రి కీలక వ్యాఖ్యలు

-

అమరావతి రాజధాని అని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా విజయవాడ, అమరావతి ప్రాంతాలు అన్నీ నీటితో నిండిపోయాయి. తాజాగా మంత్రి నారాయణ స్పందిస్తూ.. వచ్చే రెండు నెలలో టెండర్లు వేసి పనులు ప్రారంభించి వచ్చే వర్షా కాలం లోపు పూర్తి చేస్తామని తెలిపారు. కెనాల్స్ కాకుండా ఇంకా రిజర్వాయర్స్ ని సైతం డిజైన్ చేయటం జరుగుతుంది. ఎక్కువ వరద వస్తే రిజర్వాయర్స్ కి పంపించటం జరుగుతుంది. ఇలాంటివి చేయటం వల్ల అమరావతి రాజధాని కి ఎలాంటి ముప్పు ఉండదు అని స్పష్టం చేశారు.

కరకట్ట ని 4 లైన్లతో గతంలో డిజైన్ చేశాం. ఐకాన్ బిల్డింగ్స్ కి ఎలాంటి ఇబ్బందులు లేవని ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ అనేది 80 శాతం పూర్తి చేయటం జరిగింది. రైతులకి కౌలు చెల్లింపు అనేది ఒకటి క్లియర్ చేయటం జరిగింది. ల్యాండ్ పూలింగ్ పై డౌట్స్ ఉన్నాయని రైతులు అడిగారు. అయితే వాటిపై క్లారిటీ వస్తే..  భూములు ఇవ్వటానికి ముందుకి వస్తామని రైతులు చెప్పినట్టు మంత్రి నారాయణ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version