డిసెంబర్ 3 తర్వాత తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు మంత్రి KTR. మంత్రి కేటీఆర్.. “Success Meet of CMSTEI Tribal Entrepreneurs” అనే కార్యక్రమంలో పాల్గొని.. మాట్లాడుతూ.. ఇన్ని రోజులు ఎలక్షన్ క్యాంపింగ్ లో చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఇలాంటి కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది..CMSTEI లో భాగంగా ఉన్న ఎన్నో వ్యాపారాలు బయట దదేశాలకు కూడా వెళ్తున్నాయని చెప్పారు.
ప్రతిదాని పెద్దగా ఆలోచించాలి. భవిష్యత్తు అంతా గందరగోళంగా ఉన్న సింగిల్ మైండ్ విధానంతో ఆలోచించాలని కోరారు. సీఎం కేసీఆర్ సైతం ఎన్నో అపజయాలు తరువాతే ఈ స్థాయిలో ఉన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. కుల వ్యవస్థ అనేది కేవలం మనుషులు మాత్రమే సృష్టించారు దేవుడు దీన్ని కనిపెట్టలేదు..కులాల గురించి కుల వ్యవస్థ గురించి నాకు రాజకీయాల్లోకి వచ్చాకే తెలిసిందని వివరించారు. టాలెంట్ ఉంటే ఏ కులమైనా ప్రతిదీ సాధించొచ్చు..CMSTEI ప్రోగ్రాం తో 500 మంది వ్యవస్థాపకులు గా మారారని కేటీఆర్ వివరించారు. ఈ ప్రోగ్రాం లో సక్సెస్ అయిన ప్రతి ఒక్క స్టోరీ తాండాలలో అర్థం అయ్యేలా చెప్పాలని.. ఖరీదైన కలలు కంటేనే సాధన నిజమవుతుందన్నారు.