ఇక వాట్సాప్‌ లో రెండు ప్రొఫైల్ పిక్చర్స్ పెట్టుకోవచ్చు!

-

వాట్సప్ ఇటీవల ‘ఛానల్స్’ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఆ చానల్స్ కి సంబంధించి కొత్తగా ‘ఎడిట్’ ఆప్షన్ ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో మీరు మీ ఛానల్ లో చేసిన అప్డేట్లను ఎడిట్ చేసుకోవచ్చు. 30 రోజుల్లోపే వాటిని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఫోటోలు, వీడియోలు వంటి మీడియా టైప్ ఫైల్స్ ఎడిట్ చేయలేరు. ఎడిట్ చేసినట్లు ఛానల్ సభ్యులకు ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లదు. అయితే ఈ ఛానల్ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రాలేదు.

అలాగే.. వినియోగదారుల ప్రైవసీకి మరింత భద్రత కల్పించాలని వాట్సాప్ ‘ఆల్టర్ నేట్ ప్రొఫైల్’ ఫీచర్ తీసుకురానుంది. కొందరు తమ ప్రొఫైల్ కాంటాక్ట్ లిస్టులో ఉన్నవాళ్లంతా చూడాలని కోరుకోరు. ఈ ‘ఆల్టర్ నేట్ ప్రొఫైల్’ పిక్చర్ ద్వారా మీరు 2 ప్రొఫైల్ పిక్చర్స్ పెట్టుకోవచ్చు. ఉదా : ఆఫీస్ వాళ్లకి కనిపించేలా ఒకటి, ఫ్రెండ్స్ కి కనిపించేలా మరోటి పెట్టుకోవచ్చు. ఇది త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news