ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుడుతున్నారు. మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, ప్రశాంత్‌రెడ్డితో కలిసి జిల్లాలో పర్యటిస్తున్నారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. 250 కోట్లతో గోద్రెజ్ సంస్థ సహకారంతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ పార్కును కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం 260 కోట్ల రూపాయలతో లకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 1,618 కోట్ల విలువైన పనులకు కేటీఆర్ ఇవాళ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఖమ్మం, సత్తుపల్లిలో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
తారక రామారావు పేరులోనే ఒక పవర్ ఉందని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఖమ్మం పర్యటనలో భాగంగా లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ పార్కును ఆయన ప్రారంభించారు. లకారం సమీపంలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన కేటీఆర్…. తనకు తారక రామారావు అనే పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుందని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎన్టీఆర్ ఆరాధ్య దైవంగా పేర్కొన్నారు. ఆయన శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారని చెప్పారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయితే రామారావు ఆత్మ కూడా శాంతిస్తుందన్నారు