ఆసియా కప్: ఇండియా రోహిత్, కోహ్లీ లను అవుట్ చేసిన యంగ్ స్పిన్నర్… !

-

ఆసియా కప్ లో భాగంగా ఈ రోజు శ్రీలంక మరియు ఇండియా ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. మొదటి పది ఓవర్ లలో ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ మరియు గిల్ లు వికెట్ కోల్పోకుండా 65 పరుగులు చేసి ఇండియా మంచి జోరు మీద కనిపించింది. కానీ ఆ తర్వాత శుబ్మాన్ గిల్ (19) యంగ్ బౌలర్ వెల్లలాగే బంతిని సరిగా అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ఆ తర్వాత కోహ్లీ రోహిత్ శర్మ లు మరో పది పరుగులు మాత్రమే జోడించిన తర్వాత వెల్లలాగే బౌలింగ్ లో షాట్ ఆడబోయి క్యాచ్ గా వెనుతిరిగాడు. విరాట్ కోహ్లీ గత మ్యాచ్ లో సెంచరీ చేయగా… ఈ మ్యాచ్ లో అనవసరంగా అవుట్ అయ్యాడు. ఇక రోహిత్ శర్మ (53) వరుసగా రెండవ హాఫ్ సెంచరీ చేశాక, దునిత్ బౌలింగ్ లోనే బౌల్డ్ అయ్యాడు. అలా ఇండియాకు కీలక ప్లేయర్లుగా ఉన్న కోహ్లీ మరియు రోహిత్ లు యువ స్పిన్నర్ దునిత్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు.

ఇప్పుడు క్రీజులో రాహుల్ మరియయు ఇషాన్ కిషన్ లు ఉన్నారు.. మరి వీరిద్దరూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తీసుకుంటారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news