రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు : KTR

-

రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు మంత్రి KTR. విభజన హామీలపై ఏనాడు NDAను ప్రశ్నించని రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదని మంత్ర కేటీఆర్ అన్నారు. ‘గత పదేళ్ల కాలంలో గిరిజన వర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బిజెపిని నిలదీయలేదు.

కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ 100 రోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీది. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది’ అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంలో.. గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదని అడిగారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్​కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు కేటీఆర్.కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ కాంగ్రెస్​ పార్టీదని.. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీదని కేటీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news