ప్రమాదంలో మత్స్యకారుల జీవనం.. కేటీఆర్ సంచలన పోస్ట్

-

ప్రమాదంలో మత్స్యకారుల జీవనం ఉందని.. కేటీఆర్ సంచలన పోస్ట్ పెట్టారు. వృత్తి కులాలపై కత్తి కట్టినట్టు వ్యవహరిస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. మత్తడి దుంకే చెరువుల్లో మత్స్య సంపద సృష్టించిన నిన్నటి నీలి విప్లవాన్ని నీరుగార్చేస్తున్నారని ఆగ్రహించారు.

ktr on cm revanth reddy over fisheries

చేప పిల్లల పంపిణీ పథకాన్ని చెడగొట్టడానికే కాంగ్రెస్ సర్కారు ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపిస్తున్నదని విమర్శలు చేశారు. ఇప్పటి దాకా చేప పిల్లల పంపిణీ మొదలు కాలేదు..టెండర్ల దశ దాటనే లేదు..అసలు వుంటుందో లేదో ఎవరికీ తెలియదన్నారు. చేపల వేటనే నమ్ముకున్న బహుజన కులాల బతుకు దెరువును దెబ్బకొట్టడం న్యాయమా..? అని ఆగ్రహించారు.

ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం.. వృత్తికి ఊపిరిపోసి మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది..ఇన్ లాండ్ ఫిష్ ఉత్పత్తిలో తెలంగాణ అద్భుతాలు చేసిందన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచెయ్యాలనే రాజకీయ కక్షతో..మత్స్యకారుల జీవనోపాధిని కాలరాస్తారా..? అని ఆగ్రహించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version