ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ : KTR

-

ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చురకలు అంటించారు KTR. CM రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సంచలన వాక్యాలు చేశారు. ”ఆయన తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి” అని ఎద్దేవా చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని, హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ రిప్లై ఇచ్చారు.

ktr on cm revanth

తనను ఎన్ఆర్ఐ అని రేవంత్ కామెంట్ చేశారని…. ఎన్నారైని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షురాలిని చేసింది ఏ పార్టీనో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు.కంచెలు తీసినం అని బిల్డప్ ను నమ్మరు…కంచెలు వేసింది …కాంగ్రెస్ హయంలోనేనని గుర్తు చేశారు. భట్టి నియోజక వర్గంలో హామీల అఫిడవిట్ ఇచ్చారు…అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. ఇప్పటికీ మూడు క్యాబినెట్ మీటింగ్ లు అయ్యాయి…హామీల అమలు ఊసు లేదన్నారు.BRS హయాంలో ITIR లేకున్న సాధించామని…అసలు ITIR అంటే ఏంటో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు తెలుసా ? అని ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news