బీఆర్ఎస్, బీజేపీ దోస్తులైతే నా చెల్లిని జైళ్లో ఎందుకు వేస్తారు: కేటీఆర్‌

-

బీఆర్ఎస్, బీజేపీలు కలిసే ఉంటే తన సోదరి, ఎమ్మెల్సీ కవితను జైళ్లో ఎందుకు వేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రశ్నించారు. యూపీలో బీజేపీపై పోరాడలేక రాహుల్‌ కేరళకు పారిపోయారని ఎద్దేవా చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీగా రేవంత్‌ 5 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారని, సీఎం రేవంత్‌రెడ్డికి మల్కాజ్‌గిరి అన్నీ ఇచ్చిందని, కానీ మల్కాజ్‌గిరికి రేవంత్‌రెడ్డి ఏం చేశారని నిలదీశారు.

వలస పక్షులకు ఓటు వేస్తే ఎన్నికలు కాగానే అవతలపడతారని అన్నారు. అలాగే ఈటల రాజేందర్, సునీతా మహేందర్‌ రెడ్డి ఎన్నికలయ్యాక కనిపించరని విమర్శించారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు.మల్కాజిగిరిలో రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించి పార్లమెంటులో తెలంగాణ నినాదాన్ని వినిపిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్పై విరుచకు పడ్డారు. రూ.400 ఉన్న సిలిండర్‌ను మోదీ రూ.1200కు పెంచారని, దేశానికి మోదీ ప్రియమైన పీఎం కాదని, పిరమైన ప్రైమ్ మినిస్టర్ అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version