ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఆ జిల్లాల విద్యార్థులే టాప్

-

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇంటర్‌ ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు రాశారు. ఫలితాల కోసం tsbie.cgg.gov.in, results.cgg.gov.in ఈ వెబ్సైట్లను సందర్శించడి

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదిలోనూ ఇంటర్ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారని బుర్రా వెంకటేశం తెలిపారు. మరోవైపు ఇంటర్ ఫలితాల్లో పలు జిల్లాల విద్యార్థులు మెరుగైన ప్రదర్శన చూపించారని చెప్పారు. ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవగా.. మేడ్చల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇక సెకండియర్‌ ఫలితాల్లో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, మేడ్చల్ జిల్లా విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు. ఇక ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఆఖరి స్థానంలో కామారెడ్డి జిల్లా విద్యార్థులు నిలవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version