ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం అంకెల గారడీ, అభాండాల చిట్టా: కేటీఆర్‌

-

ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక, అబద్ధాల పుట్ట అని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం శ్వేతపత్రం అంకెల గారడీ, అభాండాల చిట్టా అని విమర్శించారు. రూ. 3 లక్షల కోట్ల అప్పును రూ.6 లక్షల కోట్ల అప్పులుగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు, ఇవ్వని రుణాలను కూడా అప్పులుగా చూపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి స్థూలంగా ఉన్న రుణాలు రూ. 3,17,051 కోట్లు మాత్రమేనని చెప్పారు. లేని అప్పును ఉన్న అప్పుగా చూపి తిమ్మినిబమ్మి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

“మాపై బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ, విద్యుత్‌, పౌరసరఫరాల్లో లేని అప్పు ఉన్నట్టు చూపుతున్నారు. పౌర సరఫరాల సంస్థకు ఇప్పటి వరకు ఉన్న అప్పు రూ.21,029 కోట్లు మాత్రమే. నిల్వలు, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులను దాచి అప్పులు ఎక్కువగా ఉన్నాయని చూపారు. ఆర్టీసీకి ఎన్నో విలువైన ఆస్తులు ఉన్నాయి. కార్పొరేషన్ ఆస్తులు తనఖా పెట్టుకొని అప్పులు తెచ్చుకుంటే కేసీఆర్‌ను బద్నాం చేశారు. తెలంగాణ ఇవాళ ఆకాశం అంత ఎత్తున ఉంది. ఆస్తులనే కాదు తెలంగాణ అస్తిత్వాన్ని కూడా కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించింది. 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌కు ఎంత వెల కడతారు?” అని కేటీఆర్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news