జర్నలిస్ట్ గౌతం పెట్టిన వీడియోలో ఏం తప్పు ఉందని అరెస్టు చేశారు – KTR

-

తెలంగాణ రాష్ట్రంలో..ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే అరెస్టులు జరుగుతున్న సంగతి తెలిసిందే.కొన్ని సందర్భాల్లో..తెలంగాణ జర్నలిస్టులపై దాడులు కూడా జరుగుతున్నాయి.అయితే…కెసిఆర్ ను మెచ్చుకుంటూ అలాగే రేవంత్ రెడ్డిని పొగుడుతున్న… ఓ వీడియోను తెలంగాణ జర్నలిస్టు గౌతం పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్టు అసభ్యకరంగా ఉందని తాజాగా గౌతమ్ ను అరెస్టు చేశారు పోలీసులు.

దీనిపై గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించడం జరిగింది. జర్నలిస్ట్ గౌతం గౌడ్‌ ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోలో తప్పేముందని తెలంగాణ డీజీపీని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక రైతు మాట్లాడిన వీడియో షేర్ చేసినందుకు కేసు పెడతారా? అని ఆగ్రహించారు. ఇదే రైతు మల్లయ్యని వాళ్ల స్వగ్రామంలో నేను కూడా కలిశాను.. రైతు పరిస్థితి ఎలా ఉందో కూడా ఆరా తీశాను…దానికి నా మీద కూడా కేసు పెడతారా? అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news