హైడ్రా వాళ్లు వచ్చారని.. MROను ప్రజలు పొట్టు పొట్టు కొట్టారని రేవంత్ రెడ్డి సర్కార్ పై కేటీఆర్ సెటైర్లు పేల్చారు. వరంగల్ ఎస్ఆర్ నగర్ కాలనీలో బతుకమ్మ ఆటస్థలం పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మార్వోను అడ్డుకుని కొట్టారట. అయితే… దీనిపై కేటీఆర్ స్పందించారు. నిన్న వరంగల్లో ఎమ్మార్వో బతుకమ్మ ఘాట్ సందర్శించడానికి పోతుంటే..ఇల్లు కూలగొట్టడానికి వస్తున్నాడని ఎమ్మార్వోని ప్రజలు పొట్టు పొట్టు కొట్టారని గుర్తు చేశారు కేటీఆర్.
ఇక అటు కర్నూల్ బోర్డర్ కు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి.. తరలించారని కేటీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రైతుల కోసం సీఎం సొంత నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ను భగ్నం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. రైతుల కోసం పాదయాత్ర చేస్తున్నారని… నరేందర్ రెడ్డి ని కర్నూలు బార్డర్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉంచారని ఫైర్ అయ్యారు.
మాజీ ఎమ్మెల్యే తో పాటు, రైతుల ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు అంటున్నారు…. మూసి ప్రక్షాళన కోసం అయితే లక్షన్నర కోట్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. అందులో లక్ష కోట్లు తినడానికే అని ఆరోపణలు చేశారు. సమస్యలు ఉంటే కలెక్టర్ ని అడగండి అని సీఎం అంటున్నాడని ఆగ్రహించారు.