రైతు భరోసా ఇయ్యనేలేదు..ఏడాదిలో లక్షన్నర కోట్లు అప్పులు – KTR

-

రైతు భరోసా ఇయ్యనేలేదు..ఏడాదిలో లక్షన్నర కోట్లు అప్పులు అంటూ KTR సెటైర్లు వేశారు. ఏం చేసింది లేదు .. ఏడాదిలోనే ఎనలేని అప్పులు…ఆరు గ్యారంటీలు అమలయిందే లేదు .. లెక్కకు మించి అప్పులు చేశారని రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు. పిడికెడు మన్ను తీసింది లేదు .. కొత్తగా కట్టింది లేదు .. అప్పుడే లక్షన్నర కోట్ల అప్పులు… రుణమాఫీ చేసింది లేదు .. కోట్ల అప్పు ఎందుకయింది ? అంటూ నిలదీశారు.

ktr revanth

రైతు భరోసా ఇయ్యనేలేదు .. లక్షన్నర కోట్లు ఎవ్వరి పాలు ? 2 వేల ఫించను .. 4 వేలు కానేలేదు .. అప్పు తెచ్చిన కోట్లు ఎవ్వరిపాలు ? అయిందని నిలదీశారు. మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు రూ.2500 ఊసేలేదు .. లక్షన్నర కోట్ల అప్పు ఎందుకయింది ? తులం బంగారానికి దిక్కేలేదు .. లక్షన్నర కోట్ల అప్పులో రాష్ట్ర సర్కార్ ! అంటూ ఓ రేంజ్‌ లో ఫైర్ అయ్యారు. కేసీఆర్ కిట్టు లేదు .. న్యూట్రిషన్ కిట్ రాలేదు .. లక్షన్నర కోట్ల అప్పు ఎందుకయింది ? అంటూ ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news