తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం దీక్షా దివస్‌ : కేటీఆర్

-

తెలంగాణ రాష్ట్ర గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివస్‌ అని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్షా దివస్‌ స్ఫూర్తిగా పునరంకింతమవ్వాలని పేర్కొన్నారు. నవంబరు 29న దీక్షాదివస్‌ సందర్భంగా ఆనాటి చరిత్రను గుర్తుచేస్తూ కేటీఆర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం దీక్షా దివస్‌ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నవంబర్‌ 29, 2009 తన జీవితంలో మరచిపోలేని రోజు అని.. దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను తెంచేందుకు.. కేసీఆర్‌ నడుం బిగించిన రోజు ఇది అని తెలిపారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’ అని నినదిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగి దిల్లీ పీఠం దిగొచ్చేందుకు ఈ రోజే నాందీవాచకం పలికారని గుర్తు చేశారు.

తెలంగాణ కోసం తానే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని… ఎట్ల తెలంగాణ రాదో చూస్తానని కేసీఆర్.. రాష్ట్రసాధనే ధ్యేయంగా.. నవంబర్‌ 29న సిద్దిపేటలోని రంగధాంపల్లిలో ఆమరణ నిరాహారదీక్షా ప్రారంభించారని కేటీఆర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆమరణ దీక్షకు దిగిన ఈరోజు.. మలిదశ ఉద్యమంలో లక్ష్యం దిశగా అడుగులేసేందుకు మార్గదర్శకమైందని.. ఆ స్ఫూర్తిని కొనసాగిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news