కానిస్టేబుళ్ల కుటుంబాల నిరసనపై కేటీఆర్‌ రియాక్షన్‌ !

-

కానిస్టేబుళ్ల కుటుంబాల నిరసనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ రియాక్ట్‌ అయ్యారు. తెలంగాణలో ఉద్యమం నాటి పరిస్థితులు ఇప్పుడుఉన్నాయని… మళ్లీ ప్రత్యర్థి కాంగ్రెస్సే..ప్రజల పక్షానా బీఆర్ఎస్సే!! అంటూ ఆగ్రహించారు. రైతు భరోసా, రైతు రుణమాఫీతో రైతులను దోఖా చేసిన అమానుషం..ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయని దుర్మార్గం అన్నారు. ఏడాదిలో 2లక్షల ఉద్యోగాల జాతర అనే హామీకి పాతరేసి నిరుద్యోగుల ఆశలను చిదిమేసిన విధానం… రోడ్డెక్కినా కనికరించని కాఠిన్యం అంటూ ఫైర్ అయ్యారు.

KTR

నాడు బీఆర్ఎస్ హయాంలో సకల జనుల సంక్షేమ తెలంగాణ..నేడు కాంగ్రెస్ పాలనలో సంక్షోభం వైపు పయనం అంటూ విమర్శలు చేశారు కేటీఆర్‌. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అగ్గై మండుతున్న తెలంగాణం…సర్కార్ విధానాలపై తిరగబడుతున్న జనం అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ దళం..గళం ఎప్పటికీ బీఆర్ఎస్సే..పేగులు తెగేదాకా ప్రజల కోసం కొట్లాడుతాం.. తెలంగాణను అవకాశవాదుల నుంచి కాపాడుకుంటామన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news