చిల్లర మాటలు మాట్లాడడం ఆపేసి హామీలు నెరవేర్చాలి: కేటీఆర్‌

-

మేడిపండు లాంటి బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఇలాంటి నిరాశజనకమైన బడ్జెట్‌ను ఇదివరకు ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. 53 వేల కోట్లతో అరు గ్యారెంటీలను అమలు చేస్తామని దొంగ మాటలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర మాటలు మాట్లాడడం మానేసి ప్రజలకు చేస్తామన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

 

 

ఆరు గ్యారెంటీలకు లక్షా 25 కోట్లకు పైగా నిధులు అవసరం అవుతాయని, బడ్జెట్‌లో కేటాయించింది ఎంతని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. టీఎస్ తీసి టీజీ పెట్టడం, చార్మినార్, కాకతీయ తోరణం తొలగింపు మార్పుకు శ్రీకారం చుట్టినట్లా అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్‌ను బొండపెట్టడం కాంగ్రెస్‌తో అయ్యే పని కాదని, ఇలాంటి వాల్లెందరినో చూశామని పేర్కొన్నారు. కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ ప్రాజెక్టులను, హక్కులను కాపాడారని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి, కేఆర్ఎంబీ ప్రాజెక్టులను అప్పగించారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news