తెలంగాణ ఉద్యమ నేత కేసిఆర్ కు కల్వకుంట్ల కవిత లేఖ రాయడంపై తొలిసారిగా గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కల్వకుంట్ల కవిత లేఖ రాయడంలో తప్పు లేదని.. కానీ అది బహిర్గతం కావడం కరెక్ట్ కాదంటూ వెల్లడించారు కేటీఆర్. ప్రతి కార్యకర్త… లేఖల రూపంలో కెసిఆర్ గారికి తమ అభిప్రాయాలను చెప్పడం ఏ మాత్రం తప్పు కాదు అన్నారు.

రెగ్యులర్ గా అది జరిగే ప్రాసెస్ అని వివరించారు. ఎక్కడ దెయ్యాలు లేవు.. మా ముందు ఉంది రేవంత్ రెడ్డి లాంటి దెయ్యం మాత్రమే అంటూ హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్. ఇప్పటికీ కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన.. పోరాటం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. తమ టార్గెట్ కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ స్పష్టం చేశారు కేటీఆర్.